AP: 4 విభాగాల్లో పంచాయతీలకు అవార్డులు...! 16 d ago
ఏపీలోని 4 విభాగాల్లో పంచాయతీలకు అవార్డులు వచ్చాయి. 4 పంచాయతీలకు దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పురస్కారాలు వచ్చాయి. ఆరోగ్య విభాగంలో చిత్తూరు జిల్లా బొమ్మ సముద్రం పంచాయతీ, క్లీన్ అండ్ గ్రీన్ విభాగంలో అనకాపల్లి జిల్లాలోని తగరంపూడి పంచాయతీ, వాటర్ సఫిషియెట్లో అనకాపల్లి జిల్లా నయంపూడి పంచాయతీ, సోషలిస్ట్ అండ్ సోషల్ సెక్యూర్డ్ విభాగంలో ఎన్టీఆర్ జిల్లా ముప్పాళ్ల ఎంపిక చేశారు. అవార్డులు పొందిన పంచాయతీలను డిప్యూటీ సీఎం పవన్ అభినందించారు.